చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి : రేవంత్ రెడ్డి

-

విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేసారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం అని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం వచ్చే అకడమిక్ ఇయర్ లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి.

అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసాం. టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నం. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంది. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలి అని రేవంత్ రెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news