Center key decision for pollution control in Delhi: ఢిల్లీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ లో కాలుష్య నియంత్రణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్ధాలను దగ్ధం చేసే రైతులకు భారీగా జరిమానాలు వేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్.
రెండు ఎకరాలు కల్గి ఉన్న రైతు పంట వ్యర్ధాలను కాలిస్తే 5 వేల జరిమానా విధించేలా చర్యలు తీసుకోనుంది కేంద్ర సర్కార్. 2-5 ఎకరాలు కల్గిన రైతు పంట వ్యర్ధాలను కాలేస్తే 10 వేల జరిమానా వేస్తామని స్ఫష్టం చేసింది కేంద్రం. 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు పంట వ్యర్ధాలను కాలిస్తే 30 వెలు జరిమానా వెయ్యాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేర కు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర సర్కార్. కేంద్ర నిర్ణయం పై పంజాబ్, హర్యానా రైతులు ఆగ్రహిస్తున్నారు.