Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బిగ్ షాక్. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బంద్ అయింది. అయితే.. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం అంతటా కాదులేండి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సాన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బంద్ అయింది. దీనికి గల కారణాలు ఇలా ఉన్నాయి.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సాన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. నాగ్సాన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బంద్ అయింది. మధ్యాహ్న భోజన ధర గిట్టుబాటు అవ్వడం లేదని వంట చేయడానికి మహిళలే నిరాకరించడం జరిగింది. నిత్యవరసర వస్తువులు, ఇతర ఛార్జీలు పెరిగిన తరుణంలోనే… వంట చేయడానికి మహిళలే నిరాకరించడం జరిగింది. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని ఇంటి దగ్గరి నుండి తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బంద్
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సాన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన ధర గిట్టుబాటు అవ్వడం లేదని మహిళలు వంట చేయడానికి నిరాకరించారు.
దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని ఇంటి దగ్గరి నుండి తెచ్చుకుంటున్నారు. pic.twitter.com/vVFPYbRMdq
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2024