ఈ రోజు సీఎం రేవంత్ పుట్టిన రోజు యాదగిరిగుట్ట దేవాలయంలో జరుపుకుంటున్నారు. KCR ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పి కేసీఆర్ కట్టిన యాదాద్రి లోనే నీ పుట్టినరోజు చేసుకున్నావు అని సీఎంకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. చివరికి మూసి సుందరీకరణలో భాగంగా మంచినీళ్లను కూడా కేసీఆర్ కట్టిన కాలేశ్వరం నుండి మూసికి తరలించుతామని చెప్పాడు. ఇప్పుడొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసి కేసీఆర్ మర్చిపోయేలాగా చేస్తానని చెబుతున్నాడు.
అయితే దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వతంత్రం తెచ్చిన కేసీఆర్ను ప్రజలు మర్చిపోరు. ఈ భూమి ఉన్నంతకాలం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారు. అసలు కేసీఆర్ ఏ లేకపోతే తెలంగాణ వచ్చునా.. తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా అని ప్రశ్నించిన హరీష్ రావు.. ప్రజల ప్రేమపొందే స్థానంలో రేవంత్ రెడ్డి లేడు. కానీ పోలీసులను పంపించి బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నాడు అని పేర్కొన్నారు.