తెలుగు దేశం కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్ కావడం జరిగింది. చట్ట నిబంధనలు పాటించకుంటే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని.. పౌరుల స్వేచ్ఛను తేలికగా తీసుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
పలు బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు….కూటమి సర్కార్ పై మండిపడింది. రెండు పోలీస్ స్టేషన్లలోని సీసీ ఫుటేజీని స్థానిక మేజిస్ట్రేట్లకు అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఇక అటు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు అయింది. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పొస్టింగులపై ఫిర్యాదు చేశారు స్థానిక కౌన్సిలర్. అయితే.. ఆ కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.