ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను వైసీపీ నేత హరికృష్ణ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతన్ని జిల్లా కోర్టులో హాజరుపరచగా.. హరికృష్ణ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాక జైలుకు తరలించారు.
ఇటీవల ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు.అసత్యాలు మితిమీరడం, మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్న వారిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.ఇకపై ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందుకోసం ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది.ఇప్పటికే వైఎస్ భారతి పీఎను అరెస్టు చేయగా, ఎంపీ భరత్ పీఏ కోసం పోలీసులు గాలిస్తున్నారు.