రిలయన్స్ తో ఎంఓయూ చేసుకున్న ఏపీ ప్రభుత్వం..!

-

రిలయన్స్ తో ఎంఓయూ చేసుకుంది ఏపీ ప్రభుత్వం. కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ కోసం ఈ ఎంఓయూ చేసుకుంది. అయితే దీని పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. 130 కోట్ల తో ఒక్కో ప్లాంట్ నిర్మాణం ఉంటుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చేయాలి. 25 ఏళ్ళలో 57,650 కోట్ల బెనిఫిట్.. ఒక్కొక ఫార్మర్ కు 30వేల లీజ్ వస్తుంది. 500 ప్లాంట్లు పూర్తయితే రెన్యువబుల్ ఫ్యూయల్ 9.35లక్షల LCB లకు రీప్లేస్మెంట్ జరుగుతుంది. 2.50లక్షల ఉద్యోగాలు ఈ ప్రాజెక్టులోనే రావాలి. 20లక్షల ఉద్యోగాల కల్పనలో ఇది ఒక భాగం ప్రోడ‌క్ష‌న్ 39 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సిబిజి ఏడాదికి వ‌స్తుంది.

దీని వ‌ల్ల ఇండ‌స్ట్రీయ‌ల్ గ్రోత్ బారీగా జ‌ర‌గుతుంది. 110 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానికి మెన్యూర్ వ‌ల్ల కెమికల్ ఫెర్టిలైజ‌ర్స్ వాడకం త‌గ్గుతుంది. రాష్ట్రంలో నే క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీ 2024 ఇప్ప‌టికే తీసుకువ‌చ్చాం. 10 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు ఈ పాల‌సీ ద్వారా ఆక‌ర్షించాల‌ని భావించాం అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news