ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. జార్ఖండ్‌లోని 43 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఝార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు 43 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 20న, రెండో విడతలో 38 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 23న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో “ఝార్ఖండ్ ముక్తి మోర్చా”, 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక్క స్థానంలో “రాష్ట్రీయ జనతా దళ్” గెలుపొందాయి. జే.ఎమ్.ఎమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సొరేన్ నేతృత్వంలో మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో గెలుపొందిన బిజేపి… ఈ సారి విజయం సాధించాలని చూస్తోంది. ఈ రోజు, తొలి విడతలో భాగంగా 15 జిల్లాల్లో 43 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్ 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో 683 మంది అభ్యర్థులు ఉన్నారు.. 1.37 కోట్ల మంది ఓటర్లు…ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.