కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివ మందిరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయాన్ని భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అన్ని ఆలయాలు దీపాల శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు.
ఈ క్రమంలోనే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. కీసరగుట్టకు హైదరాబాద్, మేడ్చల్,రంగారెడ్డి నుంచి సిటీ బస్సులే కాకుండా వికారాబాద్, వరంగల్, సిద్దిపేట సహా పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మరోవైపు నగరం నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను సైతం అందుబాటులో ఉంచింది. కాగా, కార్తీకపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే కీసరగుట్టకు భక్తులు క్యూ కట్టారు.