తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్టి నాయుడు మళ్లీ చెబుతున్నా…ఏం పీక్కుంటావో పీక్కో అంటూ రెచ్చిపోయారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు.
లగచర్ల లో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందని పేర్కొన్నారు. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంతే పిచ్చోడు మరొకరు ఉండరన్నారు. జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తానని ప్రకటించారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నా చేయలేదన్నారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మోడీనే మోడీయా బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నానని తెలిపారు. చిట్టి నాయుడికి కూడా అదే చెబుతున్నా…ఏం పీక్కుంటావో పీక్కో అంటూ తేల్చి చెప్పారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 50 లక్షల లంచం డబ్బుతో దొరికిన దొంగ రేవంత్.. ఆయనకు ప్రజాపోరాటాలు కుట్రగానే కనిపిస్తయ్ అంటూ మండిపడ్డారు. భూములు కోల్పోతున్న రైతులు ప్రశ్నిస్తే కుట్రనా? ఎస్పీ దగ్గరుండి బాధితులను కొట్టించడం దారుణమన్నారు.