ప్రతీ ఆడబిడ్డను రక్షించే బాధ్యత మాది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లించారు. భూములు లాక్కోవడానికి 22ఏ తీసుకొచ్చారు. మద్యం పై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడబిడ్డల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.
అదేవిధంగా రూ.1.29కోట్ల నష్టంతో విద్యుత్ శాఖను నష్టల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 9లక్షల 74వేల కోట్ల అప్పు ఉందని చంద్రబాబు తెలిపారు. అప్పులు తేవడం ఆస్తులను తాకట్టు పెట్టడమే గత ప్రభుత్వం చేసిందన్నారు. పిచ్చి రాతలు రాయడం మానుకోవాలి. సోషల్ మీడియాలో ఇతరులను ఇబ్బంది పెట్టేవిధంగా మేము పోస్టులు పెట్టమని స్పష్టం చేశారు. జగన్ ఉండటానికి రిషికొండ పై పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. మనం బాధ్యతలు చేపట్టిన నాడు వెంటిలెటర్ నుంచి బయటికి వచ్చామని తెలిపారు సీఎం చంద్రబాబు.