మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల నియామకం పై సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2016లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు నియామకాలు లేవన్నారు. చైర్మన్, సభ్యులను నియమించకపోవడం పై హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు గుర్తు చేసారు. కొంతమంది బిల్డర్లు అక్రమ కట్టడాలు చేపట్టి అమాయకులకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేసి సామాన్యులు మోసపోతున్నారని పేర్కొన్నారు. అక్రమ కట్టడాల నిరోధానికే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎనిమిదేళ్ల క్రితమే ట్రైబ్యునల్ లో నియామకాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ స్థాయిలో నిర్మాణాలు వెలిసేవి కావన్నారు. తక్షణమే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పద్మనాభరెడ్డి కోరారు.