సినీ ఇండస్ట్రీలో పోటీ అనేది సర్వసాధారణం. ప్రస్తుతం ఏ సినిమా ఎన్ని రోజులు ఆడిందనేది కాకుండా ఏ సినిమా ఎంత వసూలు చేసిందనేది చూస్తున్నారు. కలెక్షన్ల ప్రకారమే సినిమా.. హిట్టా..? పట్టా అని తేల్చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 10న గేమ్ ఛేంజర్, 12న బాలయ్య మూవీ వస్తోంది.
తాజాగా ఇవాళ సినిమాకి సంబంధించిన టీజర్, టైటిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమ సినిమాలు వస్తున్నప్పుడే పోటీ సినిమాలు సెంటిమెంట్ కార్డు ప్లే చేస్తుంటాయని తెలిపారు. ” మా సినిమాలకు పోటీగా విడుదల చేసే సినిమా వాళ్లే తమ కష్టాలు, కన్నీళ్లు గురించి చెబుతుంటారు. మేము రిలీజ్ పెట్టుకున్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మరి. ఇకపై మేము కూడా సింపతి మాటలు చెప్పాలేమో” అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం కి పోటీగా హనుమాన్ మూవీ విడుదలైన విషయం తెలిసిందే.