సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా జాబర్స్, యువతులు, మహిళలు, వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. ఇటువంటి మోసాలు దేశంలో నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సైబర్ నేరగాడు ఏకంగా పోలీసుకే కాల్ చేసి ధమ్కీ ఇవ్వాలనుకుని అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో వెలుగుచూసింది.
త్రిసూర్ సైబర్ సెల్ పోలీసు కథనం ప్రకారం.. ఇటీవల ఓ పోలీసు అధికారికి వాట్సాప్‌లో గుర్తుతెలియని నెంబర్ నుంచి నేరుగా వీడియో కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి పోలీసు యూనిఫాంలో ఉండి మాట్లాడుతున్నాడు. నిజమైన కేరళ పోలీసు వీడియో ఆఫ్ చేసి మాట్లాడుతున్నాడు. ఓ కేసులో నీ పేరు వచ్చింది. నిన్ను అరెస్టు చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు సైబర్ నేరగాడు. అంతేకాకుండా వీడియో ఆన్ చేయాలని బెదిరించగా..నిజమైన పోలీసు వీడియో ఆన్ చేయగానే సైబర్ నేరగాడు ఖంగుతున్నాడు. నీ అడ్రస్ దొరికిపోయింది.. ఇంకోసారి ఇలా చేస్తే నీ పని అయిపోతుందని సైబర్ నేరగాడికి అసలైన పోలీస్ వార్నింగ్ ఇచ్చి బుద్దిచెప్పారు.
ఏకంగా పోలీసులకే కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు
కేరళ – పోలీస్ యూనిఫాంలో త్రిస్సూర్ సైబర్ సెల్ పోలీసుకు కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాడు.
ఈ పని మానుకో, నీ అడ్రెస్ దొరికిందంటూ సైబర్ నేరగాడికి బుద్ధి చెప్పిన పోలీస్. pic.twitter.com/KgU9te1tL6
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2024