వరి సాగు, ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి తుమ్మల

-

వరిసాగు, ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శనివారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలను సైతం అధిగమించి వరి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నంబర్ వన్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

గతంలో 1 కోటి 46 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ఇప్పుడు 66.77 లక్షల ఎకరాల్లో కోటి 53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు ఆయన వివరించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా అక్కడ ఏర్పాట్లు, కొనుగోలు ప్రక్రియపై ఆరా తీసినట్లు సమాచారం. కాగా, కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు, అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన చెందున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news