తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ఊహించని పరిణామం ఎదురైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేశారు మహారాష్ట్ర పోలీసులు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళుతున్న క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేశారు.
ఇక అటు మహారాష్ట్ర చంద్రాపూర్ నియోజవర్గం గుగ్గూస్ లో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని… మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని పేర్కొన్నారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని వివరించారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ శిండే… అజిత్ పవార్ కాలరాశారని ఆగ్రహించారు. ఏక్ నాథ్ శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తెలిపారు. చంద్రాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించండని కోరారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన మహారాష్ట్ర పోలీసులు.
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళుతున్న క్రమంలో తనిఖీ pic.twitter.com/SFUaOurzhZ
— Sarita Avula (@SaritaAvula) November 16, 2024