వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు..రూ. 205 కోట్లు విడుదల !

-

వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీఓ ఇచ్చింది ప్రభుత్వం. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి లేఖ రాసింది ఆర్ & బీ శాఖ. మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని విరమించుకుంది జీఎమ్మాఆర్ సంస్థ.

A step forward in the construction of Mamunur Airport in Warangal district

ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. 253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో మామూనూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది.

Read more RELATED
Recommended to you

Latest news