మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇందిరమ్మ ఇండ్ల కొరకు 234 కోట్ల 80 లక్షల రూపాయల మంజూరు చేయడం పట్ల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజన్న ఆలయం తంతేలపై కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను తప్పి మోసం చేశారు. నాడు ముంపు గ్రామాల ప్రజల కోసం అనేక పోరాటాలు చేసాం. ముంపు గ్రామాల ప్రజలను BRS వారు మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది.
ఆనాడు టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో మన ప్రాంతంలో పల్లె నిద్ర చేశారు. టీపీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేడు ముంపు గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఐదు లక్షలు అందజేస్తున్నం. ముంపు గ్రామాల ప్రజలకు ఆశల పల్లకిలో కేసీఆర్ ఆనాడు డబుల్ బెడ్ రూమ్ కింద 5 లక్షలు ఇస్తానని మోసం చేశారు. కానీ ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇళ్లకు 230 కోట్లలను నిన్నటి రోజున మంజూరు చేశారు. నిన్నటి రోజు ప్రజలకు నిధులు విడుదల చేస్తూ జీవో మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు ముంపు గ్రామాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఆది శ్రీనివాస్.