మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడు : కొమ్మూరి కనకారావు

-

మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడు. వర్గీకరణ పేరుతో మందకృష్ణమాదిగ మాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నారు అని వైసీపి అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావు అన్నారు. ముప్పై ఏళ్లుగా మంద కృష్ణ చేస్తున్నది అదే. మాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. రెండు వర్గాల మధ్య మంటలు రాజేసి చలి కాసుకుంటున్నాడు. పెద్ద మాదిగలాగ ఉంటానన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదు. మరి చంద్రబాబుకు మళ్ళీ ఎందుకు మద్దతు చెప్తున్నావ్.. ఇద్దరి మధ్య ఉన్న లాలూచీ ఏంటి అని ప్రశ్నించారు.

అలాగే చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ప్రకారం జగన్ ని దూషించటం కరెక్టు కాదు. జగన్ మాత్రమే మాదిగని ఎంపీ చేశారు. ఇద్దరు మాదిగలకు కీలకమైన మంత్రి పదవులు సైతం జగన్ ఇచ్చారు. చంద్రబాబు ముగ్గురికే నామినేట్ పదవులు ఇస్తే, జగన్ ఏకంగా ఏడుగురికి పదవులు ఇచ్చారు. చర్మకారులు, డప్పు కళాకారులకు జగన్ పెన్షన్లు ఇచ్చారు. చంద్రబాబు ఆ పెన్షన్లు చంద్రబాబు తొలగిస్తుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించిన కొమ్మూరి కనకారావు.. చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ లేదు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news