దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతా క్రమంగా పడిపోతుంది. దీపావళి పండుగ తర్వాత నమోదైన ఏక్యూఐ మరింత దారుణంగా ఉండింది. శీతాకాలం ప్రారంభం అవ్వడంతో ప్రతిరోజూ ఏక్యూఐ 400కు పైగానే నమోదవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటి మారింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సైతం ఢిల్లీలో గాలి నాణ్యత కోసం ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకున్నారో చెప్పాలంటూ ఢిల్లీ సర్కారుపై సీరియస్ అయ్యింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస సీనియర్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాక్యలు చేశారు. దేశరాజధానిగా ఢిల్లీని ఇంకా కొనసాగించాలా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. నివాసయోగ్యంగా లేని నగరంగా ఢిల్లీ నిలుస్తోందని ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరం ఢిల్లీ. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నవంబర్ నుంచి జనవరి వరకు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.