ఈ ఏడాది సెప్టెంబర్ 09న కాళోజీ జయంతి సందర్భంగా ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిధుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్ కు కాళోజీ నారాయణరావు సాహితి పురస్కారం ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రదానం చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు తప్పు బట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ వైఖరినీ విమర్శించారు. కాళోజీ జయంతి రోజు సాహితీవేత్తలకు పురస్కారమిచ్చి.. గౌరవించుకునే ఆనవాయితిని దురుద్దేశంతో విస్మరించడం దుర్మార్గమన్నారు.
ఇది ఒక భాస్కర్ కు మాత్రమే జరిగిన అవమానం కాదని.. తెలంగాన కవులందరికీ జరిగిన అవమానమని పేర్కొన్నారు. ఈరోజు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం చేస్తున్న సందర్భంగా అయినా భాస్కర్ కు అవార్డు ప్రదానం చేయండని.. చేసిన తప్పు ను సరి చేసుకోండని ప్రభుత్వానికి సూచించారు.