తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని మూడు వందల కోట్ల ఖర్చుతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. మహిళలకు 2500,తులం బంగారం ఇస్తామని నేడు వరంగల్ సభలో సీఎం రేవంత్ చెప్పాలి. రైతు భరోసా కింద 15,000 వెలు ఒక్క రైతుకైన ఇచ్చారా.. తెలంగాణ ప్రజలకు ఏం చేశారని విజయోత్సవ సంబరాలు.. హామీలు ఎగ్గోట్టినందుకా.. యువతకు డిసెంబర్ లోపల ఇస్తానన్న 2లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయి.. ఇందిరమ్మ ఇళ్లు అని మాట ఇస్తే, ఇచ్చినట్లేననా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ వల్ల మళ్ళీ తెలంగాణలో ఎమర్జెన్సీ వచ్చేలా ఉంది. రేవంత్ రెడ్డి రైతుల నోట్లో మట్టి కొట్టి వేములవాడ పర్యటన దేనికి. హైడ్రా లగచర్ల లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది. ఓట్లకు ముందు ఓట్లకు వెనక సీఎం రేవంత్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది. మద్దతు ధరకు బోనస్ ఎటు పోయింది,రైతులు 1800 వందలకు ప్రైవేట్ కు ధాన్యం అమ్ముకున్నారు. సీఎం దెబ్బతో ఐటి రంగం, రేయల్ ఎస్టేట్స్ కుదేలైంది. చంద్రబాబు బాటలోనే శిష్యుడు వెళ్తున్నాడు. రేవంత్ ప్రభుత్వంతో తెలంగాణ పదేళ్ల వెన్నకి వెళ్ళింది అని రవి శంకర్ పేర్కొన్నారు.