తెలంగాణలో నాలుగు ఎయిర్ పోర్టులు కట్టుకుందాం.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

వరంగల్ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇటీవల తాను మహారాష్ట్ర కి ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అక్కడ ఎక్కడ చూసినా ఎయిర్ పోర్టు ఉందని తెలిపారు. ప్రతీ 100-150 కిలోమీటర్లకు ఒక ఎయిర్ పోర్టు ఉందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఇలా చోట్ల విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ మన తెలంగాణలో మాత్రం కేవలం ఒక్కటే ఉందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

చాలా రాష్ట్రాల్లో 3-4 ఎయిర్ పోర్టులు ఉన్నాయని తెలిపారు. మన తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఎయిర్ పోర్టులు ఉండొద్దు అని ప్రశ్నించారు. వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండంలో మనం కూడా ఎయిర్ పోర్టులను కట్టుకొని ప్రపంచంతో పోటీ పడుదామన్నారు. పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా  ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

Read more RELATED
Recommended to you

Latest news