2027లోపు పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు

-

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. నిధుల విడుదల విషయంలో కేంద్రం కూడా సుముఖంగా ఉందని తెలిపారు. నిపుణులు, సాంకేతిక సిబ్బంది సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఇవాళ మన రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్ పోలవరం అని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే నీటి మళ్లింపుతో కరువు లేని రాష్ట్రంగా ఏపీ మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. 2014-19 మధ్య పోలవరం నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. ఆ ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3.08 శాతం పనులు మాత్రమే చేసిందన్నారు. 2019-24 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కక్ష పూరితంగా ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు సీఎం చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Latest news