మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం..ఏకంగా 288 స్థానాలకు ఒకేసారి !

-

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్ లో నేడు మలి విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

maharashtra election 2024

ఉత్తర్ ప్రదేశ్ లో 9 అసెంబ్లీ స్థానాలకు, పంజాబ్ లో 4 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో పాలక్కాడ్, ఉత్తరాఖండ్ లో కేదారనాథ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉన్నాయి.
నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల బరిలో మొత్తం 90 మంది అభ్యర్థులు ఉన్నారు. ఘజియాబాద్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి), శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్‌సిపి (అజిత్ పవార్), మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)లతో శివసేన (UBT), NCP (శరద్ పవార్), మరియు కాంగ్రెస్ పోటీపడనున్నాయి.

 

  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
  • మహారాష్ట్ర లో 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు
  • నవంబర్ 23 ( శనివారం) ఓట్ల లెక్కింపు, ఫలితాలు
  • రెండు ప్రధాన పార్టీలు—శివసేన, ఎన్.సి.పి—-ఏకనాధ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలో చీలిన తర్వాత తొలిసారిగా జరగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
  • మహారాష్ట్ర లో మొత్తం 9 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు
  • …………………………………………………………………………………………….
  • ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
    ————————————-
  • ఈ రోజు మలి విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
    ————————————-
  • ఝార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు
    ——————————-
  • నవంబర్ 13 న 43 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, నేడు( నవంబర్ 20) మలి విడతలో 38 స్థానాలకు ఎన్నికలు
    ———————————
  • మలి విడతలో బరిలో 528 అభ్యర్థులు (472 మంది పురుషులు, 55 మంది మహిళలు, ఒక్కరు హిజ్రా)
    ———————————-
  • ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్,
    ఆయన భార్య కల్పనా సొరేన్, బిజేపి నాయకుడు, ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరి భవిష్యత్ ను నేడు నిర్ణయుంచనున్న జార్ఖండ్ ఓటర్లు
    —————————————-
  • నవంబర్ 23న వెలువడనున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
    ————————————

Read more RELATED
Recommended to you

Latest news