ఏపీని అమెరికా రేంజ్ కు తీసుకువెళతానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీలో అమెరికా లాంటి వాతావరణం తీసుకురావాలని కోరారు. కూటమి ద్వారా ఏపీకి సుపరిపాలన చేస్తామని.. డిసెంబరులో పొట్టి శ్రీరాములు గారికి మేం ప్రభుత్వం తరఫున గుర్తిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. సెంటిమెంట్ లను మేం గౌరవిస్తామని పేర్కొన్నారు.
సినిమాలు తియ్యాలన్నా రాయలసీమలో పాత చరిత్రలేనని… బ్లేడ్ బ్యాచ్ లు ఇంకా ఉన్నాయి.. జాగ్రత్త.. మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదన్నారు సీఎం చంద్రబాబు. అన్ని నగరాలలాగా మనం కూడా అభివృద్ధి పొందుతామని… పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని వివరించారు సీఎం చంద్రబాబు. ఆదాయం పెంచడం మన కర్తవ్యం… మన ప్రజలకు బాధ్యులం అన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు అగ్రదేశం లో ఉన్నారని వివరించారు సీఎం చంద్రబాబు.