ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో పదేళ్ల పాటు సీఎంగా చంద్రబాబే ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణం అన్నారు. చంద్రబాబు దార్శనికత, నాయకత్వ పటిమతో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడా ఉన్నా.. నాలెడ్జీ ఎకానమీ ప్రాతిపదికన చేసుకొని దేశమంతా విస్తరించిన విజినరీ చంద్రబాబు అని కొనియాడారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఇబ్బందులు పెట్టి జైలులో పెట్టడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా అతి త్వరలోనే చేరుకుంటుంది. గత ముఖ్యమంత్రి పాస్ బుక్కుల్లో కూడా ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టుకోవడం ఇబ్బందికరంగా అనిపించింది. గత ప్రభుత్వం ఎకానమీలో ఇబ్బందులకు గురి చేసింది. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు అనుభవమే కారణమన్నారు. ఎల్లా ప్రగడ సుబ్బారావు పేరు పెట్టడం గొప్ప విషయం అన్నారు.