బోకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు FRBM పరిమితికి మించి అప్పులు చేశారు. చంద్రబాబు బడ్జెట్ లో చెప్పే లెక్కలు ఒకటి.. బయట చెప్పే లెక్కలు మరొకటి అని పేర్కొన్నారు. సూపర్ -6 హామీలలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. 2018-19 నాటికి ప్రభుత్వం 3 లక్షల అప్పులు చేసిందని తెలిపారు. వాస్తవాలు ఏంటో బాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయి.
తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నారు. బడ్జెట్ లెక్కలకు.. బయటి లెక్కలకు ఎందుకు తేడాలు వస్తున్నాయన్నారు. కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా వృద్ది రేటు మందగించింది అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకనే బడ్జెట్ ను ఆలస్యం చేశారని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ గ్యారంటీ అప్పులు లక్ష94వేల కోట్లు అని చెప్పారు. కాగ్ రిపోర్టు 6వేల కోట్లు చెబితే.. చంద్రబాబు మాత్రం 11 వేల కోట్లు అని చెబుతుందని పేర్కొన్నారు.