కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది : దేవినేని అవినాష్

-

తెలుగు దేశం పార్టీకి చెందిన ITDP సోషల్ మీడియాలో వైసిపి అధినేత వైయస్ జగన్, ఇతర ప్రజాప్రతినిధులు పై మార్ఫింగ్ ఫోటోలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఇతర వైసీపీ నేతలు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. జగన్ కుటుంబంపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆధారాలు అందచేశం. వైసిపి వాళ్ళు ఏ పోస్టులు పెట్టకపోయినా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు టిడిపి వాళ్ళు చేసిందేమిటి అని ప్రశ్నించారు. కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని రిప్రజంటేషన్ ఇచ్చాం. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది. కానీ మేము వైసిపి శ్రేణులకు ఆన్ని విధాలుగా అండగా ఉంటాం. అయితే మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో ఉండే ITDP పై చర్యలు తీసుకోవాలి అని దేవినేని అవినాష్ డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news