తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల కృషి ఫలితంగా ఏర్పడింది అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మీ కష్టానికి తప్పకుండా ఫలితాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అంత నిత్యం ప్రజల్లో ఉండి సేవలు చేస్తున్నారు. రైతులకు 2 లక్షల రుణ మాఫీ కోసం 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది లో చేసింది. 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పాలకులది.
మహాత్మ గాంధీ, నెహ్రు లు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. బీజేపీ చరిత్రను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయంగా కుట్రలు చేస్తోంది. రాహుల్ గాంధీ గారి దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు దేశంలో పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చేయాలన్న లక్ష్యంగా మనం పని చేయాలి అని పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. .