తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ రిలీజ్ చేయబోతుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఈ టికెట్లు విడుదలవుతాయి. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ , దర్శన టికెట్లు అన్నీ ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.
అంగ ప్రదక్షణ టికెట్లు కూడా విడుదల చేయనున్నారు. వీటిని శుక్రవారం ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక రేపే మధ్యాహ్నం 3 గంటలకు వయవృద్ధులు అలాగే దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్లు కూడా విడుదలవుతాయి. ఈ మేరకు టీటీడీ పాలక మండలి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 9 కంపార్ట్మెంట్లలో తిరుమల శ్రీవారి భక్తులు దర్శనాల కోసం వేచి ఉన్నారు.
దీంతో.. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న ఒక్కరోజు తిరుమల శ్రీవారిని 59,231 మంది భక్తులు దర్శించుకున్నారు.అలాగే నేను ఒక్క రోజే 22,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజు ఉండి ఆదాయం 3.08 కోట్లుగా నమోదు అయింది.