ఈ ఆహారపదార్దాలకు దూరంగా ఉండండి.. లేదంటే కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి..!

-

చాలా మంది అనేక రకాల ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఎక్కువ మంది కీళ్ల నొప్పులు కారణంగా బాధపడుతూ ఉంటారు. కీళ్ల నొప్పులు రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు వస్తాయట. అలాగే నడుము నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెడ్ మీట్ కి వీలైనంత వరకు దూరంగా ఉంటే ఈ సమస్యలు తలెత్తవు. అలాగే కీళ్ల నొప్పులు ఎక్కువగా రాకుండా ఉండాలంటే సోయా తో చేసినవి తీసుకోవద్దు.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు వస్తాయి. కనుక సోయా ఫుడ్ ని కూడా తీసుకోవద్దు. వాటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాగే పంచదార ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే కీళ్ల నొప్పులు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పిండి పదార్థాలని కూడా ఎక్కువగా తీసుకోకూడదు. పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

కనుక అలాంటి ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. 2020 పరిశోధన ప్రకారం ఎక్కువ తియ్యటి పానీయాలను తీసుకునే వాళ్ళలో కీళ్ల నొప్పులు తీవ్రంగా వస్తున్నాయని తేలింది. కాబట్టి వాటిని కూడా తీసుకోవద్దు. ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవడం, పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటుగా రోజు కాసేపు వాకింగ్ చిన్నపాటి వ్యాయామలు వంటివి చేయండి. అలాగే ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఇలా చేస్తే హాయిగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news