బీఆర్ఎస్ మహాధర్నా పిలుపుతో రేవంత్‌కు వణుకుపుట్టింది : మాజీ మంత్రి సత్యవతి

-

బీఆర్ఎస్ ఇచ్చిన మహాధర్నా పిలుపుతో సీఎం రేవంత్‌కు వణుకుపుట్టిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ ధర్నా పిలుపుతో సీఎం రేవంత్‌ రెడ్డిలో వణుకు పుట్టిందని, మానుకోటలో బీఆర్‌ఎస్‌ ధర్నా చేస్తే రాష్ట్రమంతటా ప్రజలు ఆందోళనలు చేస్తారనే భయంతోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేశామని, త్వరలోనే 50 వేల మందితో నిర్వహిస్తామని సత్యవతి రాథోడ్‌ కీలక ప్రకటన చేశారు.ఇక నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించబోయే సభలను అడ్డుకుంటామన్నారు. మొత్తం ప్లాన్ చేసుకున్నాక చివరి నిమిషంలో పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించడం దారుణమని ధ్వజమెత్తారు. త్వరలో హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news