గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం నిధుల సేకరణకు 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని ఆరోపణలు తెర పైకి వచ్చాయి. అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో పాటు 8 మందిపై కేసు నమోదు చేసి వారెంట్ జారీ చేసింది న్యూయార్క్ కోర్టు. గౌతమ్ అదానీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.ఈ నేపథ్యంలో అదానీ గ్రూపు స్పందించింది. యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ తమ సంస్థపైన చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది.
మరోవైపు అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. “ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని, అదానీ వైపేనా? అఖండ భారతంలో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? అని ప్రశ్నించారు. అసలు ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ.. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా” అని ప్రధాని ని ప్రశ్నించింది ఎమ్మెల్సీ కవిత.