శోభిత-నాగచైతన్య పెళ్లిపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

అక్కినేని నాగచైతన్య మరోసారి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.శోభిత దూళిపాళ్లను రెండో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తవ్వగా.. పెళ్లి పనులకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ -4వ తేదీన హైదరాబాద్‌లోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే తన కొడుకు నాగచైతన్య పెళ్లిపై తండ్రి నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అక్కినేని నాగచైతన్య- శోభిత దూళిపాళ్ల వివాహం చాలా సింపుల్‌గా జరుగుతుందని తెలిపారు.అందుకు అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక అవుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ పెళ్లికి కేవలం 300-400 మంది కుటుంబసభ్యులు, బంధువులు, ఇండస్ట్రీలోని సన్నిహితులను మాత్రమే పిలిచినట్లు పేర్కొన్నారు. కపుల్స్ ఇద్దరూ సింపుల్‌గా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు నాగ్ చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news