Prevention of Land Encroachment Act 2024: శాసనమండలిలో శుక్రవారం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు కు 2024కు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ… భూదురాక్రమణ నిరోధక చట్టం 2024 కబ్జాకోరుల గుండల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది….భూ దురాక్రమణ రాష్ర్టంలో తీవ్రమైన సమస్యగా ఉందని తెలిపారు.
పెద్ద సంఖ్యలో భూ యజమానులు కష్ట నష్టాలను అనుభవిస్తున్నారని ఆగ్రహించారు.
గత ఐదు ఏళ్లలో వైసీపీ నేతలు… కబ్జా చేయటమే దినచర్యగా మార్చుకుని వేలాది ఎకరాలు కబ్జాలు చేశారన్నారు. నకిలీ పత్రాలతో బెదిరింపులు, భూ దురాక్రమణలు, వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులు, బలవంతపు రిజిస్ర్టేషన్ వంటి అక్రమాలను ఈ చట్టం అరికట్టనుందని తెలిపారు. ప్రజలు చెమట్చోడి సంసాదించుకున్న ఆస్తికి ఈ చట్టం రక్షణ కల్పించనుంది…ఈ చట్టం అటు పట్టణ ప్రాంతాలతో పాటు ఇటు గ్రామీణ ప్రాంతాలకు, రాష్ర్టం మొత్తానికి వర్తిస్తుందన్నారు.
నేరం నిరూపించబడితే 10 నుండి 14 ఏళ్ల పాటు జైలు శిక్ష తోపాటు కబ్జా చేసిన భూమి యొక్క మార్కెట్ విలువకు సమానంగా అపరాధ రుసుం విధించడం జరుగుతుందని హెచ్చరించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. భూదురాక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టర్ ఆధర్వ్యంలో కమిటీ ఏర్పాటుచేస్తాం…భూదురాక్రమణ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు.