తిరుమల భక్తులకు అలర్ట్.. సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 63731 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 3.94 కోట్లుగా నమోదు అయింది.
ఇక అటు ఇవాళ పిబ్రవరి,వయోవృద్ధులు, వికలాంగుల టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం ఆన్ లైన్ లో పిభ్రవరి నెల దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి. ఇవాళ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల కానున్నాయి.