రేవంత్‌ సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ది ఆత్మహత్య కాదు..హత్యనే – KTR

-

సీఎం రేవంత్‌ సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన కామెంట్స్‌ చేశారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టంచేసిన నేపథ్యంలో.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల బ్రదర్స్ పై కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు.

KTR Reacts On Kondareddy saireddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఇది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య ఇదంటూ నిప్పులు చెరిగారు. ఆరు నెలల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో.. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖానాను కట్టడమే కాకుండా.. సీఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతోనే తీవ్ర మనస్థాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news