తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్…మరోసారి గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే తేదీన ఆర్ఆర్బీ , గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. దీంతో అయోమయంలో అభ్యర్థులు ఉన్నారు. దీంతో గ్రూప్ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతోందట.
అదే రోజు జూనియర్ ఇంజినీర్ , టెక్నిషియన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆర్ఆర్బీ పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండటంతో వాయిదా అసాధ్యం అన్న సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ 2 ను వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ నిరుద్యోగులు. సర్కార్ ముందు చూపు లేకుండా నిర్ణయాలు తీసుకుందని విమర్శలు వస్తున్నాయి.