గుడ్ న్యూస్‌: మ‌రో సారి దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

గ‌త మూడు రోజులుగా దిగొస్తున్న బంగారం ధర.. ఈ రోజు కూడా అవే బాట ప‌ట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర శుక్రవారం తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.41,000కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం పరుగులు పెట్టింది. ఈ పసిడి ధర ఏకంగా రూ.370 ర్యాలీ చేసింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.38,020కు చేరింది. మ‌రోవైపు వెండి షాకిస్తూ పైకి క‌దిలింది. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.49,300కు ఎగసింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 పైకి కదిలింది. దీంతో ధర రూ.38,800కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.340 పెరుగుదలతో రూ.40,000కు పెరిగింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.300 పెరుగుదలతో రూ.49,300కు ఎగసింది.

Read more RELATED
Recommended to you

Latest news