డబ్బు ఆదా చేయడం కూడా ఓ కళే. ఆ కళలో నిష్ణాతులు అవ్వటానికి చాలా ఓపిక, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. డబ్బు ఆదా చేసే అలవాటును నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి. దానికోసం కొన్ని టిప్స్ పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డ్స్ పక్కన పడేయండి:
డబ్బు మీద మీకు కంట్రోల్ లేకపోతే క్రెడిట్ కార్డులను అస్సలు వాడకండి. ఎందుకంటే కార్డు యూస్ చేసి మీరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. కార్డ్స్ కారణంగానే చాలామంది అప్పులు చేస్తారు. కాబట్టి డబ్బు ఆదా చేయాలంటే కార్డ్స్ కి దూరంగా ఉండాలి.
విండో షాపింగ్ అసలే వద్దు:
కేవలం కాలక్షేపం కోసం షాపింగ్ మాల్ కి వెళ్లే అలవాటును మానుకోండి. అలాగే డిస్కౌంట్స్ ఏమున్నాయో చెక్ చేద్దామని ఆన్ లైన్ లో విండో షాపింగ్ చేయకండి. దానివల్ల మీకు అవసరం లేని వాటిని కూడా కొంటుంటారు. ఒక వస్తువు మీకు నిజంగా అవసరం అయితేనే షాపింగ్ కి వెళ్ళండి.
జీరో డే:
ప్రతీ రోజు కాఫీ తాగటానికో లేక మరొకదానికో ఎంతో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే వారంలో ఒకరోజు అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకండి. దీనివల్ల ఖర్చు చేయడం అనే అలవాటు మీద మీకు కంట్రోల్ వస్తుంది.
పార్టీలు అసలే వద్దు:
వారం వారం వర్క్ స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలన్న ఉద్దేశంతో పార్టీలు చేసుకోవడం మానేయండి. దానివల్ల మీ జేబుకు చిల్లు పడుతుంది. నిజంగా స్ట్రెస్ నుండి రిలీఫ్ కావాలంటే వేరే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోండి.
సోషల్ మీడియాకి దూరం:
అస్తమానం సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉండటం వల్ల.. వాటిలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ మిమ్మల్ని డబ్బు ఖర్చు పెట్టే విధంగా చేస్తాయి. కాబట్టి సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.