ఎమ్మెల్సీ కవిత మరోసారి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా అదానీ లంచాల వ్యవహారంపై నోరువిప్పిన కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాక తొలిసారి పొలిటికల్ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆమె తన నివాసంలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి మరియు బీసీ కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు.
సోమవారం ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్‌కు బీసీ సంఘాల సమస్యలపై నివేదిక అందజేయనున్న నేపథ్యంలో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. కాగా, కవిత అరెస్టై జైలుకు వెళ్లకముందు అసెంబ్లీలో ఫూలే విగ్రహ డిమాండ్-బీసీ హక్కుల సాధన ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్(యూపీఏ), భారత జాగృతి సంస్థల తరుపున జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ‘మనమెంతో మనకంతా’ అనే నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న కవిత కులగణన చట్టబద్దంగా చేయాలంటూ డిమాండ్ చేశారు.