మహారాష్టలో కౌన్ బనేగా సీఎం. ? బీజేపీ స్టాటజీ మారుతోందా..?

-

మహారాష్టలో మహాయుతి బిగ్ విక్టరీ కొట్టింది.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా బంఫర్ మెజార్టీతో గెలిచింది.. మహావికాస్ అఘాడియా దరిదాపుల్లో కూడా లేదు.. దీంతో బిజేపీ సారధ్యంలో ఉన్న మహాయుతి మరోసారి అధికార పగ్గాలను చేపట్టబోతోంది.. అయితే ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతోంది.. కౌన్ బనేగా మహారాష్ట సీఎం..? మహాయుతి నుంచి ముగ్గురు కీలక నేతలు బరిలో ఉండటంతో..సీఎం పీఠం ఎవరిని వరిస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.

మహారాష్టలో సీఎం ఎన్నికపై చర్చలు జరుగుతున్నాయి.. షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తున్నామని బీజేపీ అధిష్ఠానం ముందుగానే ప్రకటించింది. అయితే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది.. దేవేంద్ర ఫడ్నవిస్‌కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీ అప్పగించింది.. అందుకు తగ్గట్టే ఆయన సమర్ధవంతంగా పార్టీని విజయపథంలో నిలబెట్టారు.. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించనుందనే అంశంపైనే ప్రధానంగా అందరి దృష్టి ఉంది.

మహారాష్టలో బిజేపీ 132 స్థానాలను కైవసం చేసుకుంది.. శివసేన షిండే పార్టీ 57 సీట్లుతో రెండో్ స్థానంలో.. 41 సీట్లతో ఎన్సీపీ మూడో స్థానంలో ఉంది.. మహాయుతి దూకుడు ముందు.. మహావికాస అఘాడియా వెలవెలబోయింది.. ప్రతిపక్షహోదా కోసం అఘాడియాలో ఓ కూటమికి రాలేదు.. మహారాష్టలో అతిపెద్ద పార్టీగా బిజేపీ అవతరించడంతో సీఎం అంశం కీలకంగా మారింది..

గతంలో ఏక్ నాధ్ షిండే సీఎంగా ఉండగా.. ఇప్పుడు బిజేపీ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంది.. ఈ క్రమంలో షిండేను కొనసాగిస్తారా.. లేక బిజేపీ సీఎం పీఠాన్ని తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది..ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. ఈసారి ఫడ్నవిస్‌కే సీఎం పీఠం దక్కనుందనే అభిప్రాయం మెజారిటీ బీజేపీ నేతల్లో ఉంది. దీనిపై కమలం పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news