పెళ్లి తర్వాత మీ కెరీర్ ని మళ్ళీ మొదలు పెట్టాలని ఉందా..? అయితే ఈ టిప్స్ ని పక్కా ఫాలో అవ్వండి..!

-

మీరు మీ కెరీయర్ ని పెళ్లి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే పక్కా వీటిని ఫాలో అవ్వండి. ఇలా చేస్తే మాత్రం ఇబ్బంది రాదు. చాలామంది మహిళలు ఎంతో ఇష్టపడి చేసే ఉద్యోగాన్ని పెళ్లి కారణంగా వదిలేస్తున్నారు. కానీ మళ్ళీ అన్నీ సర్దుకున్నాక మళ్ళీ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. మీరు కూడా అలా మళ్లీ ఉద్యోగంలో చేరాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. పెళ్లి అయ్యాక వైవాహిక జీవితం సర్దుకున్న వెంటనే కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ సర్దుకోకపోతే వెయిట్ చేయండి. మంచి టైం వచ్చే వరకు చూడండి. మళ్లీ మీరు అదే జాబ్ లోకి వెళ్లాలనుకుంటే ముందు మీరు మీ స్నేహితులు లేదంటే పాత ఉద్యోగస్తులతో మాట్లాడండి.

మీ పాత ఆఫీస్ లో ఏమైనా జాబ్ ఉందా..? ఆ జాబ్ ఎలా ఉంది అనే దాని గురించి అడిగి తెలుసుకోండి. అలాగే అవసరమైతే కెరియర్ కి సంబంధించిన కోర్సులు చేయండి. ఒకవేళ కెరియర్ లో ఎక్కువ గ్యాప్ వచ్చింది అంటే ఏదైనా అవసరమైన కోర్స్ ని పూర్తి చేసి ఆ తర్వాత జాబ్ లోకి వెళ్ళండి. అలాగే కెరియర్ లో మీరు వెనకబడడం వలన అనుకున్న జీతం రాకపోవచ్చు. అలాంటప్పుడు అస్సలు మీరు డౌన్ అవ్వొద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందులో మిమల్ని మీరు ప్రూవ్ చేసుకోండి.

నెక్స్ట్ లెవెల్ కి మీరు వెళ్లే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. పెళ్లికి ముందు ఎంచుకున్న రంగం కాకుండా మరో దానికి వెళ్లాలని అనుకుంటే దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే అవసరమైన విషయాలన్నిటిని తెలుసుకుని అందులో ఎలాంటి స్కోప్ ఉంటుందనేది తెలుసుకోండి. అలాగే చదువుతో పాటుగా టెక్నాలజీ పై అవగాహన ఉండాలి. ఆ విషయాల్లో కూడా వెనుక పడకండి. మీ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టేటప్పుడు రెజ్యుమ్ ని అప్డేట్ చేయండి. అలాగే మహిళల కోసం కొన్ని వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి అలాంటి వాటి గురించి కూడా తెలుసుకుని వాటిని అనుసరించండి.

Read more RELATED
Recommended to you

Latest news