తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కోరారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ‘ఎక్స్’ 1+1 గన్ మెన్ల భద్రతను వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ రాశారు. తాను ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నానని, అందుకే తనకు కేటాయించిన గన్‌మెన్లను వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
2019 నుంచి 2024 వరకూ తన భద్రత, శ్రేయస్సు కోసం ప్రస్తుత, గత ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని, 2019 నుంచి విశాఖలోని శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ, కూటమి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా, గతంలో వైసీపీ ప్రభుత్వం భీమిలి మండలం కొత్తవలస సమీపంలో 15 ఎకరాల ప్రభుత్వ భూములను నామమాత్రపు ధరకు శారదా పీఠానికి కేటాయించడంతో వాటిని కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది.