తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సన్న రకాలపై ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 విషయంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా రైతుల్లో భరోసా కల్పించాలని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.