రామ్ గోపాల్ వర్మపై 3 కేసులు ఉన్న తరుణంలో..ఇవాళ హై కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వర్మ. దీంతో రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు.
కాగా, అజ్ఞాతం వీడిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బ తిన్నాయని కేసులు పెడుతున్నారని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ఆగ్రహించారు. ఒకే రోజు నాలుగు వేరు, వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బ తిన్నాయా? అంటూ ఫైర్ అయ్యారు. నేను ఎవరిపై ట్వీట్లు వేసానో వారి మనోభావాలు దెబ్బ తినకుండా, వేరే ఎవరికో మనోభావాలు దెబ్బ ఎలా తింటాయి? దీనికి కేసులు ఎలా వర్తిస్తాయి అని నిలదీశారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.