ఇటీవల జరిగిన ఉప ఎన్నిక, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మెజార్టీ సీట్లను సాధించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా ఆయన చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేరళ, ఝార్కండ్ లో మెజారిటీ సాధించిందని తెలిపారు. మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు. కేరళ వయనాడ్ లో అత్యధిక మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలిచారని పేర్కొన్నారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో మంచి మెజార్టీతో గెలిపించుకుంటున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు భేటీ అవుతారని చెప్పారు. ప్రతి నెల ఆర్టీసీకి రూ.400 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్ రూ.500 కే ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రైతు భరోసా పై కసరత్తు జరుగుతుందని.. 2లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇన్నాళ్లు