చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా లోతుగా ఆలోచిస్తూ, ఏదో అయిపోతుందని భయపడుతూ, డెసిషన్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు. ఈ విధంగా లైఫ్ లో ఆనందాన్ని కోల్పోవడమే కాకుండా ఎదగకుండా ఆగిపోతారు.
ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. అయితే ఓవర్ థింకింగ్ సమస్యను అధిగమించవచ్చు. దానికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
ఈ క్షణం గురించి ఆలోచించండి:
అతిగా ఆలోచించే వాళ్ళు రేపేం జరుగుతుందోనని భయపడతారు. అలా కాకుండా కేవలం ఈ క్షణం గురించి ఆలోచించడం నేర్చుకోండి. ప్రస్తుతం ఒక పని చేయడం వల్ల ఎలాంటి లాభనష్టాలు ఉన్నాయనే దాన్ని మాత్రమే ఆలోచించండి.
ఆలోచనకు టైం సెట్ చేసుకోండి:
ఒక దాని గురించి మీరు ఆలోచించాలి అనుకున్నప్పుడు.. పర్టికులర్ గా టైం సెట్ చేసుకోండి. కేవలం ఆ సమయంలో మాత్రమే ఆ విషయం ఆలోచించండి. ఆ సమయం తర్వాత ఆలోచనల్ని ఆపేయండి. అలా ఆపాలంటే మీరు వేరే ఆలోచన చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇది అసాధ్యమేమీ కాదు.
నోట్ బుక్ లో రాయండి:
ఏ విషయం గురించైతే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన లాభనష్టాలను నోట్ బుక్ లో రాయండి. అలా రాయడం వల్ల మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. ప్రాబ్లమ్ ఏంటనేది క్లియర్ గా బుక్ లో కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ఉంటారు.
వేరే పనులు చేయండి:
అతిగా ఆలోచించేవాళ్లు దాన్నుండి బయటపడాలంటే.. ఆ ఆలోచనకు సంబంధించిన పనులు కాకుండా వేరే పనులు చేయాలి. ఏదైనా మంచి కామెడీ సినిమా చూడటమో, కామిక్ బుక్ చదవటమో, ఫ్రెండ్స్ తో పిచ్చాపాటి కబుర్లు చెప్పటమో చేస్తే బాగుంటుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.