ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వితంతువులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా వితంతు పెన్షన్ పంపిణీ పై కీలక ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. వితంతు పెన్షన్ బాధితులకు వెంటనే అందించేలా చర్యలు తీసుకోనుంది. వృద్ధాప్య పెన్షన్ తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛన్ మంజూరు అయ్యేలా… చర్యలు తీసుకోనుంది చంద్రబాబు ప్రభుత్వం.
భర్త ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపు మరణిస్తే వెంటనే పెన్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే 15వ తేదీ నుంచి 30వ తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ అందజేయాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని… అలాంటి పేదలను ఆదుకోవాలని.. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.